దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొన్నటివరకు కిలో ఉల్లి రూ.30-రూ.40 వరకు ఉండగా, ప్రస్తుతం రూ. 80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యుల జేబులకు ఉల్లి చిల్లు వేస్తోంది. ఈ క్రమంలోనే ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర రంగంలోకి దిగింది. ఈ క్రమంలో బఫర్ స్టాక్ నుంచి రిటైల్ మార్కెట్లలోకి లక్ష టన్నుల ఉల్లిని విడుదల చేస్తున్నట్టు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపింది. దీంతో సామాన్యుడికి భారీ ఊరట లభిస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి.