BJP చీఫ్ పురందేశ్వరికి YCP నేత విజయసాయిరెడ్డి కౌంటర్ విసిరారు. 'అమ్మా పురందేశ్వరి గారూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి TDP బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్కు నేరుగా మద్దతు పలుకుతున్న TDPకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే... మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటుపొడిచే మీ రాజకీయమా?' అంటూ ట్వీట్ చేశారు.