దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు కేంద్రం ఆర్దికంగా సాయం ఈ నెలలో రానున్నాయి. 15వ ఇనిస్టాల్ మెంట్ నిధులను దీపావళి వేళ రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల కేంద్ర అధికారులు ఈ నెల 27న ముహూర్తంగా నిర్ణయించారు. కానీ, దీపావళి వేళ రైతులకు అందేలా తాజాగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సొమ్ము నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది.