మనదేశంలో అక్రమ బెట్టింగ్ యాప్ లకు ఎంతో మంది బలవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అక్రమ బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిశ్చయించింది. ఈ నేపథ్యంలో, పలు అక్రమ బెట్టింగ్ లు, వెబ్ సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. 22 బెట్టింగ్ యాప్ లు, వెబ్ సైట్ కార్యకలాపాలను కేంద్రం బ్లాక్ చేసింది. కేంద్రం బ్లాక్ చేసిన యాప్ ల జాబితాలో ఇటీవల కలకలం రేపిన మహదేవ్ బుక్ బెట్టింగ్ యాప్ కూడా ఉంది. బెట్టింగ్ యాప్ కార్యకలాపాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు తర్వాత కేంద్రం తాజా చర్యలు తీసుకుంటుంది. ఛత్తీస్ గఢ్ లో మహదేవ్ బుక్ యాప్ అక్రమాలకు సరఫరాతోందని ఐటీ శాఖ.