విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు ప్రధాని మోదీ ప్రభుత్వం పూనుకోవడాన్ని దారుణమని డీవైఎఫ్‌ఐ కడప జిల్లా నాయకుడు మధుశేఖర్ తెలిపారు. ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న పోరాటం ఈ నెల 8 నాటికి వేయి రోజులు పూర్తవుతుందని చెప్పారు. విద్యార్థి యువజన సంఘాలు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడం, 8న రాష్ట్ర వ్యాప్తవిద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. లాభాలు వస్తున్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించాలని ఆలోచనలు విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఫ్యాక్టరీకి అనుబందంగా ఇనుము, గనులు కేటాయించకపోవడం సిగ్గు చేటు అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును రాయలసీమ ప్రాంతంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నా ఇంత వరకు అమలు చేయలేదని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు.