ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతుండగా.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనాయకత్వం.. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధమా అంటూ కేంద్రమంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్.. తాజాగా ఓ ఫోటో ట్వీట్ చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నాయకత్వాన్ని, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరింది. ఈ క్రమంలోనే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాల రిపోర్ట్ కార్టులు చూపించాలని కొన్ని రోజుల క్రితం బీజేపీని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కు స్పందించిన కేంద్రమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీకి, భూపేష్ బఘేల్ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే గత ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో చేసిన అభివృద్ధి పనుల గురించి చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అమిత్ షా విసిరిన ఈ సవాల్‌ను ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ స్వీకరించారు. గత ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి గురించి.. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ పాలనలో జరిగిన కుంభకోణాలపై చర్చ జరగాలని పేర్కొన్నారు. దీనిపై సమాధానం కోసం ఎదురుచూస్తున్నానంటూ అమిత్ షాకు భూపేష్ బఘేల్ కౌంటర ఇచ్చారు.
ఈ సందర్బంగా అమిత్ షా సవాల్‌ను స్వీకరించినట్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలోనే అమిత్ షా సవాల్ విసిరిన పండరియా నియోజకవర్గానికే వెళ్లి ఆ సవాల్‌ను స్వీకరించానని పేర్కొన్నారు. అయితే అమిత్ షా కేవలం సవాల్ మాత్రమే విసిరారని.. కానీ వేదిక, సమయం, తేదీ గురించి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఈ సవాల్‌కు ప్రజలు వేదిక సిద్ధం చేశారని.. డేట్, టైం చెప్పండి అమిత్ షాజీ అంటూ ఓ సోఫా ఫోటోను ట్వీట్ చేస్తూ భూపేష్ బఘేల్ ప్రశ్నలు సంధించారు. ఇక ఆయన షేర్ చేసిన సోఫాపై ఒక పక్క అమిత్ షా పేరు, మరోపక్క భూపేష్ బఘేల్ పేరు రాసి ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం మొదటి దశ పోలింగ్ పూర్తయింది. ఇక రెండో దశ ఓటింగ్ నవంబర్ 17న నిర్వహించనున్నారు. డిసెంబర్ 3 వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.