వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర పల్నాడు జిల్లా వినుకొండలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ... ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కుటుంబ సభ్యులుగా భావించి దగ్గరకు తీసుకున్న జగనన్న. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఆదుకున్న రాజశేఖరరెడ్డి. ఎందరో ఇంజనీర్లు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నారంటే అందుకు కారణం వైయస్సార్. మన నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరించిన జగనన్న. ఘాట్ రోడ్డు నిర్మాణం, రామలింగేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేస్తున్నారు. వినుకొండకు రూ.100 కోట్లతో పెద్దాసుపత్రి ఇచ్చారు. చంద్రబాబు మారుతీకారు, బెంజ్ కారు ఇస్తానన్నాడు. 2014–19 మధ్య ఎందుకు ఇవ్వలేదు? అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.