చంద్రబాబు నేతృత్వంలోని గత ప్రభుత్వం పేదలను,బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదనే ప్రజలు తిరిగబడి జగన్ ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారు అని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. అయన మాట్లాడుతూ........ కారు చీకట్లో కాంతి రేఖగా జగన్ ని ప్రజలు గుర్తించి ముఖ్యమంత్రిని చేసారని కొనియాడారు. ప్రజల ఆశల ను, ఆశయాలను సాకారం చేసినందునే సాధికార యాత్రకు జనం ఎగబడుతున్నారన్నారు.. తన వల్ల మంచి జరిగితేనే తనకు ఓటు వేయ్యాలని లేకుంటే వద్దని సీఎం జగన్ అడుగగలుగుతున్నారని సీతారామ్ వ్యాఖ్యానించారు పెత్తందారీ వ్యవస్థలో బానిసలుగా ఉన్న బడుగులకు విముక్తిని కలిగించేందుకు జగన్ పోరాడుతున్నారు. చేయూతనిచ్చిన నేత జగన్ ను చేజార్చుకుంటామా అని ప్రజలను ప్రశ్నించారు. ఈవాళ అభివృద్ధి కోసం టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారని, అభివృద్ధి అంటే ఆర్థికంగా, సామాజికంగా , సమతుల్యంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో సీఎంగా జగన్ ను గెలిపించుకోవాలి, 37 పథకాలు పెట్టి ప్రజలకు జగన్ బటన్ నొక్కి నిధులు నేరుగా జమ చేస్తున్నారని, ఐదేళ్ల తర్వాత మనం ఒకే ఒక్క సారి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి జగన్ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు.