దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చారు సీఎం జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పదవులు ఇచ్చి, పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సాధికారతకు బాటలు వేశారని మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ అన్నారు. అయన మాట్లాడుతూ.... స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను చిన్నచూపే చూశాయి. సున్నా కింద లెక్కకట్టారు. ఆ సున్నా పక్కనే ఒకటి పెట్టి పది, వేలు, వందలు, కోట్లు చేసిన గొప్ప నాయకుడు జగనన్న. ఎవరి అండదండలు లేకున్నా, పెద్దగా బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, యాదవకులానికి చెందిన నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేను చేసిన, మంత్రిని చేసిన మంచి మనిషి జగనన్న. ఆయనను మించిన గొప్పనాయకుడు నాకు కనిపించలేదు ఇప్పటిదాకా. జగన్‌మోహన్‌రెడ్డి మనల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. గతంలో నాయీ బ్రహ్మణులను అవమానించిన చరిత్ర బాబుది. మత్స్యకారులను అవమానించిన చరిత్ర బాబుది. ఆ సోదరులను కూడా రాజ్యసభకు పంపిన గొప్పనాయకుడు జగనన్న. నాయీ బ్రాహ్మణ సోదరుల్ని, తిరుమల నుంచి అన్ని దేవాలయాల్లో సభ్యుల్ని చేసి సత్కరించిన పెద్దమనసు జగనన్నది. మనం ముందుకు వెళ్లాలనుకుంటే జగనన్న వెంటే నడవాలి. మన కోసం ఎంతదూరమైనా వెళ్లే, ఎంతపోరాటానికై సిద్దపడే, అనుక్షణం పేద, బడుగు, బలహీన వర్గాల వారి గురించి ఆలోచించే.. జగనన్న చేస్తున్న మంచి పనుల గురించి మనమందరం ఆలోచించాలి. మరోసారి మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్న దొంగ కూటముల కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఆ దొంగకూటముల బాబు, పవన్‌ల దొంగనాటకాలకు తెరవేయాలి. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను బలంగా నమ్ముకున్న జగనన్నను గెలిపించుకుందాం. నాటకాల రాయుళ్లను పారిపోయేలా చేద్దాం. మన బిడ్డల కోసం, పేద బిడ్డల కోసం ..వారి ఉజ్జ్వల భవిష్యత్తుకోసం ఎంతో ఆలోచించే దార్శనికుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు.