భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలయింది. ఎంతో మంది ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ ఏ ఒక్కరూ సామాజిక సాధికారత దిశగా ఆలోచించింది లేదు. ఈ రోజు సామాజిక సాధికారతే నా నినాదం అంటున్నారు జగనన్న అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. తన కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. డిప్యూటీ సీఎంలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని నియమించారు. నేను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేనయినా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా.. అంతా ముఖ్యమంత్రి గొప్పదనమే. మొట్టమొదటిసారిగా మైనార్టీ మహిళను శాసనమండలి వైస్‌ఛైర్మన్‌గా నియమించారు. మైనార్టీ పక్షపాతి అయిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందంటే, అది మన ఏపీలోనే. 2024 జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడం బడుగు బలహీన వర్గాల వారికి చారిత్రక అవసరం. మళ్లీ చంద్రబాబు తన అబద్ధపు హామీలతో ప్రజల ముందుకు వస్తారు. –గతంలో ఆయన బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిందీ ఏమీ లేదు. మనకోసం నిలబడే, మనల్ని ముందుకు నడిపించాలని తపించే జగనన్న గెలిపించుకోవడం మన కర్తవ్యం. వర్షం పడుతున్నా చెక్కుచెదరకుండా ఇక్కడే నిలబడ్డ అశేష జనావళిని చూస్తుంటే... అందరూ జగనన్నను గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారని అర్థమవుతోంది అని అన్నారు .