రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర బ్రహ్మండంగా విజయవంతంగా సాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు లక్షలాదిగా తరలివచ్చి సామాజిక సాధికార యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి పట్ల ఆయావర్గాలన్నీ చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ యాత్రకు అపూర్వ ఘనస్వాగతం పలుకుతున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ తమను అన్నింటా అక్కునజేర్చుకుని సంక్షేమాన్ని అందజేస్తున్న జగనన్న మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు. సుభిక్షమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన మరలా కావాలని వారంతా ముక్తకంఠంతో కీర్తిస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు ప్రభుత్వంపై, మా నాయకులపై ఎంత బురదజల్లాలని ప్రయత్నించినా.. మీ మాటల్ని ప్రజలు నమ్మరు గాక నమ్మరు అని అన్నారు.