ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మైనార్టీలు నా వాళ్లే అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతారు అని మంత్రి నారాయణ స్వామి అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... తన ప్రభుత్వంలో బీసీలను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పవన్ కల్యాణ్ కాపుల ఓట్ల కోసం చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు ప్రాకులాడుతున్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు మాట్లాడం పై చంద్రబాబుకు ఎస్సీలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అయ్యింది. బీసీలను ,ఎస్సీలను నాడు చంద్రబాబు అవమానిస్తూ మాట్లాడిన మాటలెవరూ మర్చిపోరు. చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర రాష్ట్రం దేశం అంతా తెలుసు అని చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. రాష్ట్ర ప్రజలందరికీ నవరత్నాల పథకాలతో మంచి చేస్తుంటే చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలు కడుపు మంటతో ఉన్నాయని విమర్శించారు.