పశుసంర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, జగన్ సీఎం కాక ముందు ప్రజల జీవన పరిస్థితులు అత్యంత అధ్వాన్నంగా ఉండేవని, ఆ దారుణ స్థితిగతులను సమూలంగా మార్చివేసి విద్యా, వైద్యా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని పశుసంర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గుర్తు చేసారు. బీసీలను అడుగడునా అవమానించిన చంద్రబాబు ఎక్కడ.... రాజ్యాధికారం ఇచ్చి అన్ని అవకాశాలు కల్పించి బిసి,ఎస్సి,ఎస్టి, మైనారిటీల ఆత్మగౌరవాన్ని నిలిపిన సీఎం జగన్ ఎక్కడో ప్రజలు ఆలోచించాలన్నారు.. ప్రజల వద్దకు ప్రజా ప్రతినిధులు వచ్చి సంక్షేమ పాలన చేస్తుంటే ఓర్వలేక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. రైల్వే స్టేషన్ లో స్టీల్ కుర్చీలు వేయడం తప్పితే శ్రీకాకుళం జిల్లాకు ఏమి చేసారో చెప్పాలని డిమాండ్ చేసారు. రామ్మోహన్ నాయాడు రాజకీయాలకు రాజీనామా చేసి బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలని అప్పలరాజు ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా యువత వలస పోకుండా ఉండేందుకు సీఎం జగన్ స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించేలా పోర్టు నిర్మాణం చేస్తున్నారని గుర్తు చేసారు. నేరేడు బ్యారేజ్ పూర్తయితే రైతంగానికి సాగునీరు అందుతుందని భావించి ఒడిశా ముఖ్యమంత్రిని సీఎం జగన్ కలసి పరిష్కారానికి కృషి చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ఆముదాలవలస గడ్డ,, వైఎస్సార్ సీపీ అడ్డా అంటూ అప్పలరాజు ప్రజలతో కలసి నినదించారు.