వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర పల్నాడు జిల్లా వినుకొండలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.... సామాజిక సాధికారత ఈరోజు స్టేజీ మీద చూస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా మంత్రులుగా చేసిన ఘనత జగనన్నది. ఈ గడ్డపై పుట్టిన గుర్రం జాషువాను చంద్రబాబు గుర్తించలేదు. సెప్టెంబర్ 28న జాషువా జయంతిని అధికారికంగా జరుపుకోవాలని ఉత్తర్వులిచ్చిన జగనన్న. చంద్రబాబు కుళ్లు, కుతంత్రాలు ఆ గట్టుమీద ఉన్నాయి. మోసపూరిత మాటలతో కోర్టులను కూడా పక్కదోవ పట్టించాడు. ఈ గట్టున నా ఎస్సీలు, నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీలు అనే జగనన్న ఉన్నారు. ఏ గట్టుకు వెళ్తారో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈరోజు మంత్రులుగా మేం ఇక్కడ ఉన్నామంటే జగనన్న ఇచ్చిన సాధికారతే అని అన్నారు.