గత కొంత కాలం చంద్రబాబు అరెస్ట్ పై ఆరోపణలు చేశారని.. ఇప్పుడు కండిషనల్ బెయిల్ పై బయటకు రావడంతో విజయవాడ సమీపంలోని కంచికచర్లలో జరిగిన విద్యార్థుల మధ్య గొడవను దళితులపై దాడిగా చిత్రీకరించాలని కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనితవిరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రంలోని బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలంతా జగనన్నకి అండగా నిలుస్తున్నారన్నది ఈ సామాజిక సాధికార యాత్రతో రుజువవుతోందన్నారు. కంచికచర్ల ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపై గానీ, ఇతర వర్గాల పై గానీ ఎవరు దాడులు చేసినా, ఎవరు దురాఘతాలు చేసినా మా ప్రభుత్వం, మా పోలీసులు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు.