నేడు వైయస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. నేడు సామాజిక సాధికార బస్సు యాత్ర, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి రాజన్న దొర ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. ఉదయం 10:30 గంటలకు మెంటాడ మండలం పోరాం గ్రామంలో వైయస్ఆర్సీపీ నేతల మీడియా సమావేశం. అనంతరం పోరాం గ్రామంలోని సచివాలయం సందర్శన.పెద్దమెడపల్లి, బూసాయవలస, రామభద్రపురం మీదుగా బస్సుయాత్ర. మధ్యాహ్నం మూడు గంటలకు సాలూరు బోసు బొమ్మ జంక్షన్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.