వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర పల్నాడు జిల్లా వినుకొండలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజని మాట్లాడుతూ.... జగనన్న కటౌట్‌తో బస్సు యాత్ర చేస్తుంటే ఈరోజు ఇంత మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పెద్ద ఎత్తున వచ్చారు. వేదికపై జగనన్న లేరు. మీ గుండెల్లో ఉన్నారు. జగనన్న వస్తే వినుకొండ జన సునామీగా మారుతుందేమో! 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే. దేశ చరిత్రలో జగనన్న తెచ్చిన సాధికారత ఏ రాజకీయ పార్టీ, నాయకుడు, ఏ ముఖ్యమంత్రీ చేయలేదు. వార్డు మెంబర్‌నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు జగనన్న అవకాశం ఇచ్చారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా నడిపేందుకు రూ.2.40 లక్షల కోట్ల డీబీటీ ఇచ్చారు. మా అక్కచెల్లెమ్మలకు అమ్మ ఒడి ఎవరిస్తున్నారు? చేయూత ఎవరిస్తున్నారు? ఆసరా ఎవరిస్తున్నారు? మన పేర్ల మీద పుట్టింటి ఆస్తిలా 30 లక్షలకుపైగా ఇళ్లస్థలాలు ఎవరిచ్చారు? బీసీల్లో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఇచ్చి ఎన్నడూ లేని విధంగా గొప్ప అవకాశాలు కల్పించిన జగనన్న. బీసీ మంత్రిగా మహిళకు అవకాశం ఇచ్చిన ఘనత జగనన్నది. చంద్రబాబు పాలనలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను అవమానించారు. రానున్న ఎన్నికల్లో వీళ్లంతా చంద్రబాబు తోక కత్తిరించబోతున్నారు అని అన్నారు.