చంద్రబాబు నాయుడు స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో భారీస్థాయి అవినీతికి పాల్పడి ఆధారాలతో సహా సీఐడీకి దొరికిన దొంగ. కనుకే, ఆయన్ను గౌరవ న్యాయస్థానాలు రిమాండ్‌కు తరలించాయని మంత్రి జోగి రమేష్ అన్నారు. అయన మాట్లాడుతూ.... ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్న ఖైదీ. ఇదిలా ఉంటే, లోకేశ్‌నేమో..మా నాన్నను రూ.27 కోట్లుకే అరెస్టు చేస్తారా..? అంటాడు. అవినీతికి ఒక స్థాయి ఉండాలనేది లోకేశ్ అనుకుంటున్నాడా..? స్కిల్ స్కామ్‌లో మొత్తం రూ.3600 కోట్లు మింగేసేందుకు రచించిన పథకం అని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. పేరున్న సీమెన్స్ సంస్థను తెరమీదికి తెచ్చి షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ ఖజానాను అడ్డంగా దోచుకున్న దొంగ చంద్రబాబు. అరెస్టులో, రిమాండ్ లో అన్యాయం, అక్రమం ఏముంది..?