చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం తేనేపల్లి పంచాయతీ ఎస్టీ కాలనీలో వింత ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త గ్రామంలో పంచాయతీ పెట్టాడు. గ్రామ ఆచార ప్రకారం ఊరి నడిబొడ్డున అందరి సమక్షంలో మరిగే నూనెలో చేతులు ముంచాలి. చేతులు కాలి బొబ్బలక్కక పోతే గంగమ్మ నిరపరాధి. కాలితే మాత్రం అపరాధం చేసినట్టే. ఈ మూఢ విశ్వాసం ఈనాటిది కాదు.. తరతరాలుగా కొనసాగుతోంది. సమాచారం తెలిసుకున్న ఎంపీడీవో గౌరీ ఆగమేఘాలపై పల్లెకు చేరుకొన్నారు. ఆ మూఢాచారాన్ని అడ్డుకున్నారు. ఇలా చేయడం తప్పని గ్రామస్తులకు నచ్చ చెప్పారు. గుండయ్యను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa