ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ అండగా నిలిచిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2023, 11:19 AM

సీఎం జగన్ మరోసారి తన మానవతను చాటుకున్నారు.  నూజివీడులో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం తిరిగి హెలిపాడ్ కు వెళ్లబోతుండగా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న లింగపాలెం మండలం బోగొలుకు చెందిన తాడేపల్లి అనితాపాల్ కు, నూజివీడు పట్టణం కొత్తపేట కు చెందిన శీలం నాగమురళీకృష్ణ కు,  పెదవేగి మండలం రాయన్నపాలెం కు చెందిన  పల్లగాని శ్రీనివాసరావు కు, పెదవేగి మండలం లక్ష్మీపురం కు చెందిన గుడ్ల రంగారావుకు, అగిరిపల్లికి చెందిన సాదం గోపీనాధ్, తూర్పు గోదావరి జిల్లా సమనస గ్రామానికి చెందిన మండా హేమకు, నూజివీడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన మండపాటి రమేష్ కు, పశ్చిమ గోదావరి జిల్లా కొప్పర్రు కు చెందిన బద్ద రత్నకుమారి కి కృష్ణా జిల్లా మర్లపాలెం గ్రామానికి  చెందిన  పెదగామల్ల కృపారాణి కి లక్ష రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు, వారి సమక్షంలో వ్యాధిగ్రస్తులకు  ఆర్ధిక సహాయం చెక్కులను జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి , నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com