2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి రెండు సీట్లు కూడా వస్తాయో లేదో తెలీదని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అనుమానం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....సీఎంగారు గతంలో నూజివీడు వచ్చినప్పుడు హమీలు ఇచ్చారు, ఆ రోజు నేను ఈ హామీలు అమలవుతాయా లేదా అని భయపడ్డాను, కానీ అన్ని హామీలు నెరవేర్చిన ఏకైక సీఎం, ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని పథకాలు ఉన్నాయా అని అడుగుతున్నా, సీఎంగారు ఇది మెట్ట ప్రాంతం, అటవీ భూములు, పోరంబోకు భూములు ఉన్నాయి, గతంలో వైఎస్‌ఆర్ గారు వేలమందికి పట్టాలిచ్చారు. ఇప్పుడు మీరు ఇస్తున్నారు, నాడు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌ది, ఇప్పుడు వైయస్ జగన్ గారిది, చంద్రబాబు ఎప్పుడైనా పట్టా ఇచ్చారా, ఇవ్వలేదు, చంద్రబాబు నూజివీడు వచ్చిన ప్రతిసారి ట్రిపుల్ ఐటీలో ఒక మొక్క నాటారు తప్ప నూజివీడుకు చేసిందేం లేదు, ఆ మొక్కలు కూడా చనిపోయాయి, ఈ రోజు సీఎంగారు వేలాదిమందికి ఇళ్ళ స్ధలాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నారు, చంద్రబాబు నూజివీడుకు ఏం చేశారని అడుగుతున్నా, చంద్రబాబు రైతు భరోసా ఇచ్చారా ఎన్నడైనా, ఇవ్వలేదు, నూజివీడులో క్యాపిటల్ అన్నారు కానీ ఇక్కడ కాకుండా తీసుకెళ్ళిపోయారు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అన్నారు ముగ్గులేశారు కానీ అతీగతీ లేదు అని ఎద్దేవా చేసారు.