ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను టీడీపీ మోసం చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 18, 2023, 11:17 AM

టిడిపి ప్రభుత్వ హయంలో పేద ప్రజల సొమ్మును జలగలలా పీల్చారని వైసీపీ ఎస్సి నాయకులు దాసి జయప్రకాష్ (కెనడి) అన్నారు. అయన మాట్లాడుతూ.... టిడ్కో ఇళ్ల పేరుతో నాలుగు కోట్ల రూపాయల స్కామును చేసిన కొట్టేటి హనుమంతరావు సహా టిడిపి నాయకులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో బాధితుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ నిలుస్తుందన్నారు. కొట్టెటి హనుమంతరావు వెనుక ప్రధాన ముద్ధాయిలు ఇంకా ఉన్నారని సమగ్ర విచారణ జరిపి వారిని కూడా అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసారు. హనుమంతరావు చేసిన అవినీతిలో వాళ్ళకి కూడా వాటా ఉందని వారిని కూడా అరెస్ట్ చేయాలనీ కోరారు. ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే 55 మంది భాదితులు ఉంటె నగరవ్యాప్తంగా ఇంకా భాదితులున్నారని అన్నారు. కొట్టేటి హనుమంతరావు కి బడా నాయకుల అండ ఉండబట్టే ఇంత అవినీతి చేసాడని పేర్కొన్నారు. ఇళ్ల విషయంలోనే టిడిపి వారు అవినీతి చేస్తే ఇంకా ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేపట్టారో ప్రజలు గమనించాలని కోరారు. కొట్టేటి హనుమంతరావు లాంటి అవినీతిపరులు నగరంలో ఇంకా చాలామంది ఉన్నారన్నారు. 40వ డివిజన్ కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సొమ్ము దోచేయడం పట్ల టిడిపికి ఉన్న శ్రద్ద హనుమంతరావును చుస్తే తెలుస్తుందన్నారు జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను మోసం చేసిన పార్టీ టిడిపి అన్ని అన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com