బీసీ కులాల మనోవభావాలను పరిగణలోకి తీసుకొని వారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అయన మాట్లాడుతూ.... పేదరికంలో మగ్గుతున్న, పేదరికం శాపంగా భావిస్తున్న ఆయా వర్గాల్లో సమాన అవకాశాలు కల్పించే దిశగా సీఎం వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి కనీస మౌలిక వసతులు కల్పించి, వారు సుఖంగా జీవించాలని కోరుకున్నారన్నారు. అదేవిధంగా గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా గ్రామ స్వపరిపాలన ఉండాలని మహాత్మా గాంధీ ఆకాంక్షించారన్నారు. సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని మహిళలకు సముచిత గౌరవం దక్కేలా, ప్రతి పథకంలో మహిళలకు పెద్ద పీట వేస్తూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని తమ్మినేని సీతారాం తెలిపారు. కుల గణనకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.