కేరళలో నవంబర్ 14న జరిగిన యూత్ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించారని ఆరోపణలు రావడం చాలా తీవ్రమైన విషయమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం అన్నారు. కాసర్‌గోడ్‌లోని నవ కేరళ సదస్సు వేదికపై మాట్లాడిన పినరయి విజయన్ ఇది జరగకూడని విషయమన్నారు. ఇంతకు ముందు కూడా ఇలా జరిగిందా, ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నవంబర్ 14న రాష్ట్రంలో జరిగిన యూత్ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల్లో నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించారనే ఆరోపణలపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా నకిలీ ఓటర్ల గుర్తింపు కార్డుల వినియోగంపై విచారణకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన కేరళ పోలీసుల ప్రత్యేక బృందాన్ని నియమించారు.