ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆరు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో కలిసి నితిన్ గడ్కరీ సొరంగం దగ్గరకు చేరుకున్నారు. కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించారు. సొరంగంలో చిక్కుకున్న వారి పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు. వారిని బయటకు తీసుకురావడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని అన్నారు.