వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ...నేను ఎస్టీని, ఒక దళితుడిని. నిరక్షరాస్యుల బిడ్డను. పేదబిడ్డను. జగనన్న చలవతో డిప్యూటీ సీఎం అయ్యాను. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లలో బడుగు బలహీనవర్గాలకు ఏం మేలు జరిగింది? జగనన్న నాలుగున్నరేళ్లలో ఎంత మంచి జరిగింది? అని ఆలోచిస్తే..ఆయనకు మనమెంతగా రుణపడిపోయామో తెలుస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, వారి స్థాయిని పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు తన హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఎంత చులకనగా చూశారో, ఎన్ని అవమానాలు చేశారో చూశాం. ఆయన్ని నమ్మితే నిండా మునగడమే. బాబు బడుగు,బలహీన వర్గాలను ఓటుబ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారు. బడుగు, బలహీన వర్గాల సామాజికస్థాయి, ఆర్థిక ఉన్నతి పెంచిన అసలు సిసలైన ప్రజానాయకుడు జగనన్న అని అన్నారు.