వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో సామాజిక సాధికార యాత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఏపీలో ముందెన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకొనేలా పాలన జరుగుతోంది. ఈ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూస్తున్న జగనన్న. చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నాడు. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. జడ్జిలుగా బీసీలు పనికిరారన్నాడు. మహనీయులు కన్న కలలు ఇప్పుడు సాకారం అవుతున్నాయి. రూ.2.40 లక్షల కోట్లు డైరెక్ట్‌గా ప్రజలకు ఇచ్చిన జగనన్న. ఆశ్రిత పక్షపాతం లేదు. అందులో 78 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. 2.70 లక్షల ఉద్యోగాలిస్తే 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే. పిల్లవాడు చదవాలంటే ఇంగ్లీషు మీడియం తెచ్చారు. పుస్తకాలు, బట్టల దాకా ఇచ్చి ఆదుకున్న ముఖ్యమంత్రి. ఇదివరకు ప్రభుత్వాల్లో వైద్యం అనారోగ్యం బారినపడింది. ఇప్పుడు దేశంలో ఎక్కడైనా చూపించుకొనేలా చేసిన జగనన్న. ఇంటికొచ్చాక ఖర్చులకూ డబ్బులిచ్చే సీఎం జగన్ అని తెలిపారు.