వైసీపీ ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న సామజిక సాధికార బస్సు యాత్ర లో భాగంగా మంత్రి కారుమూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ.... జగనన్న చెప్పినవి, చెప్పనివి కూడా చేశారు. కలెక్టర్ల మీటింగ్‌లో చంద్రబాబు.. మా వాళ్లకే చేయండి, మా వాళ్లనే చూసుకోండని అన్నారు. కానీ జగనన్న పార్టీలు, కులాలు, మతాలు చూడొద్దన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ పథకం అందకుండా ఉండరాదని జగనన్న చెప్పారు. గడప గడపకూ వెళ్లినప్పుడు ఓ ఆవిడ ఎదురొచ్చింది. మేము పక్కా తెలుగుదేశం. ఓటు వేయలేదు, రూ.2.50 లక్షలు లబ్ధి వచ్చింది, రెండు కాసులు బంగారం కొన్నాం అంది. రేపు ఎన్నికల్లో నా భర్త, నేను, ఓటేసి రుణం తీర్చుకుంటామంది. వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని సినిమా యాక్టర్ అంటున్నాడు. జగనన్నకు వ్యతిరేక ఓటు లేదు. చదువుల్లో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మూడో స్థానానికి తెచ్చిన జగనన్న. పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గించారు. పౌష్టికాహార లోపాన్ని 24 శాతం ఉంచి 8 శాతానికి తగ్గించారు. నాడు–నేడుతో స్కూళ్లను ఆధునికంగా తీర్చిదిద్ది రూ.15 వేలు అమ్మ ఒడి ఇస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇంగ్లీషు మీడియం వద్దంటున్నారు. వాళ్ల పిల్లలు మాత్రం ఇంగ్లీషులో చదవాలి. మన పిల్లలు చదవొద్దా? జీడీపీ పెరిగింది. కొనుగోలు శక్తి పెరిగింది. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుకు పోతుంటే ఎల్లో మీడియా కావాలనే బురదజల్లుతోంది అని ఆగ్రహం వ్యక్తపరిచారు.