దక్షిణ అమెరికా దేశం సురినామ్లో విషాధ ఘటన జరిగింది. రాజధాని పరామారిబో సమీపంలో ఉన్న ఓ బంగారు గని కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్రమంగా బంగారం తవ్వేందుకు వారంతా వెళ్లగా, అకస్మాత్తుగా గని కూలిపోయిందని దేశ అధ్యక్షుడు చాన్ సాంటోకి తెలిపారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెళ్లేలోపే వారంతా చనిపోయారని చెప్పారు. అక్రమంగా గనుల్లో తవ్వకాలు అక్కడ సర్వసాధారణంగా మారాయి.