ధర్మవరంలోని టిడిపి కార్యాలయం నందు నియోజకవర్గ బాధ్యులు పరిటాల శ్రీరామ్ టిడిపి నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ,ఈ నెల 23న ఎంపీ రామ్మోహన్ నాయుడు నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలిపారు. మొక్కలు పంపిణీ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.