భార్యను వేధించిన కేసులో భర్తకు ఏడాది పాటు జైలు శిక్షను న్యాయస్థానం విధిస్తూ తీర్పునిచ్చారు. దర్శికి చెందిన మహిళను ఆమె భర్త మద్యానికి బానిసై తరచూ వేధిస్తున్న క్రమంలో, గత ఏడాది మార్చి 17న పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానం ముందు సరైన సాక్షాలను ప్రవేశపెట్టడంతో నిందితుడికి న్యాయమూర్తి సంవత్సరం జైలు, రూ. 1, 000 జరిమానా విధించారు. శిక్ష పడేలా చేసిన పోలీసు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.