వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి కనుమరుగైందని కంబదూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వరనాయుడు ఎద్దేవా చేశారు. శెట్టూరు మండల పరిధిలోని తిప్పనపల్లిలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... ఈ నాలుగున్నరేళ్ల పాలనలో దోపిడీ, అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. అభివృద్ధి పూర్తిగా శూన్యం అని విమర్శించారు. టీడీపీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.