రైతులతో పాటు కౌలు రైతులను ఆదుకునేలా సీఎం జగన్ సాయం ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించడంతో పాటు, కళ్యాణమస్తు రూ.5 లక్షలకు పెంచాలి. దళిత, ఆదివాసీలకు రూ.75 వేల నుంచి 1.20 లక్షలు చేసినట్లు ప్రకటించడం యువతను తప్పుదారిపట్టించడమే. కరువులో చిక్కుకున్న రైతు, కూలీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఏపీలో సుమారు 300కు పైగా మండలాలల్లో తీవ్రమైన కరువు ఏర్పడింది’’ అని శ్రీనివాసరావు తెలిపారు.