గుంతకల్లు మండలంలోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం క్షీరాబ్ది ద్వాదశి (తులసమ్మ పండుగ)శ్రీ తులసీ ధాత్రీ కల్యాణాన్ని వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ గురుప్రసాద్, ధర్మ కర్తల మండలి చైర్మన్ సుగుణమ్మ, సభ్యులు, అధికారులు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa