ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 52(2) ప్రకారం, గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి మరణిస్తే, ఎన్నిక వాయిదా వేయబడుతుంది. ఈసీ మరికొద్ది రోజుల్లో కొత్త తేదీని ప్రకటిస్తారు. గతంలో స్వతంత్ర అభ్యర్థి చనిపోయినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆ నిబంధనను సవరించారు. రాజస్థాన్‌లోని కరణ్‌పూర్‌లో కూడా ఇదే జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మృతి చెందడంతో ఎన్నిక వాయిదా పడింది. దీంతో ఇవాళ అక్కడ పోలింగ్ జరగడంలేదని అధికారులు తెలిపారు.