దేశంలో కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా మహాపడావ్ నిర్వహించారు. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన మహా పడావ్ ఆదివారం రాష్ట్ర రాజధానుల్లో రాజ్ భవన్ల ముందు ప్రారంభమైంది.
దేశమంతటా ఆయా రాష్ట్రాలకు చెందిన రైతులు, కార్మికులు ముఖ్యంగా మహిళలు, యువకులు పెద్దసంఖ్యలో భాగస్వాములయ్యారు. నేడు, రేపు (సోమవారం, మంగళవారం) కూడా మహాపడావ్ కొనసాగనుంది.. ఎస్కే ఎం, సెంట్రల్ ట్రేడ్ యూనియన్‌లు, ఫెడరేషన్‌లకు చెందిన నాయకులు ఆయా రాష్ట్రాల రాజధానులలో జరిగిన మహాపడావ్‌ల్లో పాల్గొన్నారు.