మహాపడావ్ లో ”ప్రధాన డిమాండ్లలో అన్ని పంటలకు సి2ం50 శాతంతో కూడిన ఎంఎస్పీతో సేకరణకు చట్టబద్ధంగా హామీ ఇవ్వాలి. అన్ని రైతు కుటుంబాలకు సమగ్ర రుణమాఫీ చేయాలి. విద్యుత్ బిల్లు 2022ను ఉపసంహరించుకోవాలి. నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలి. కనీస వేతనం నెలకు రూ. 26,000 ఇవ్వాలి. నిరుద్యోగాన్ని నిర్మూలించాలి. ఉపాధిని ప్రాథమిక హక్కుగా అమలు చేయాలి. రూ.600 రోజువారీ వేతనంతో ఏడాదికి 200 రోజుల ఉద్యోగంతో ఉపాధి హామీని బలోపేతం చేయాలి. ప్రభుత్వ రంగ యూనిట్ల ప్యివేటీకరణను ఆపాలి. ధరల పెరుగుదలను అదుపు చేయాలి. లఖింపూర్ ఖేరీ రైతుల హత్యకు ప్రధాన కుట్రదారుడు కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రాను తొలగించాలి.
ప్రాసిక్యూట్ చేయాలి” వంటి డిమాండ్లను కార్మికులు, రైతులు లేవనెత్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో గవర్నర్ కార్యాలయాల వద్ద మహా పడావ్ కొనసాగింది. హర్యానా, పంజాబ్ రాజధాని చండీగఢ్, పంచకుల, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రా డూన్, జమ్ము కాశ్మీర్ రాజధాని శ్రీనగర్, ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో, బీహార్ రాజధాని పాట్నా, జార్ఖండ్ రాజధాని రాంచీ, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా, అసోం రాజధాని గౌహతి, ఒడిశా రాజధాని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ, తమిళనాడు రాజధాని చెన్నై, కర్నాటక రాజధాని బెంగుళూరు, కేరళ రాజధాని తిరువనంతపురంతో సహా రాష్ట్ర రాజధానులలో చారిత్రాత్మకమైన ఆందోళనలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు భాగస్వామ్యులయ్యారు.