పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు అర్జీలను పేదలకు పంపిణీ చేశారు. సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి లంక దుర్గారావు నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షల ఇస్తామని ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ సామాగ్రి, సిమెంట్, ఇసుక, ఇటుక, కంకర, రవాణా చార్జీలు పెరిగిన దృష్ట్యా ఇంటి నిర్మాణం కోసం రూ5లక్షలు మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పేదల తరపున సీఎం చంద్రబాబును కోరినట్లు తెలిపారు.
గత మూడు రోజులగా పటమట రామలింగేశ్వర్నగర్ ప్రాంతాల్లోని 9, 14, 15, 16 డివిజన్లలో ఇళ్లులేని పేదలకు ఇంటి స్థలం కోసం ప్రభుత్వానికి సమర్పించే అర్జీ దరఖాస్తులను అందజేసినట్లు తెలిపారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్కు పేదలతో ఈ వ్యక్తిగత అర్జీలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు దోనేపూడి సూరిబాబు, మహిళా సమాఖ్య నగర నాయకురాలు లంకా నాగమణి, 9, 14వ డివిజన్ల కార్యదర్శి లంక ప్రసాద్, సైకం రాము, నడికుదిటి ఉమామహేశ్వరిలు పాల్గొన్నారు.