ప్రాథమిక రాతపరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించని హోంగార్డు అభ్యర్థులకు నోటిఫికేషన్ను ప్రశ్నించే హక్కు ఉండదని, వారి విషయంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తి వేయాలని కోరుతూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రవిప్రకాశ్ కౌంటర్లో పేర్కొన్నారు.
మరోవైపు ఇదే అంశంపై శనివారం హైకోర్టులో మరికొందరు అన్క్వాలిఫైడ్ హోంగార్డు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు వచ్చాయి. వారిని కూడా ఫిజికల్, తుది రాతపరీక్షకు అనుమతించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.