మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఛాతీలో నొప్పితో ఆస్పత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. తొలుత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న చెల్లుబోయిన.. అనంతరం మెరుగైన చికిత్స కోసం మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. సోమవారం (నవంబర్ 27) సాయంత్రం ఆయన ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఫిర్యాదు చేయడంతో కుటుంబసభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. మంత్రి వేణుగోపాలకృష్ణను పరిశీలించిన వైద్యులు చికిత్స అందించారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైన వార్త విని అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయన 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆస్పత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం.