వైసీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ...ఇచ్చిన మాట ప్రకారమే సీట్లలోను, పదవుల్లోను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అగ్రస్థానం ఇచ్చారు. అది కదా...మాటిస్తే తప్పని నైజం. రాయలసీమ జిల్లాల్లో ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలుంటే, అందులో ఐదు బీసీ, ఎస్సీలకే ఇచ్చారు జగనన్న. ఏమాత్రం రాజకీయ, ఆర్థిక బలం లేని మాలాంటి వాళ్లం ఎంపీలం, ఎమ్మెల్యేలం అయ్యామంటే అది జగనన్న చలవే. సామాజిక న్యాయమంటే జగనన్న.పుస్తకాల్లో మాత్రమే ఉన్న సామాజిక సాధికారతను ఆచరణలోకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అలాంటి మంచి నాయకుడి వెంట మనం ఉండటం ఎంతో అవసరం అని పిలుపునిచ్చారు.