ఎన్టీఆర్ జిల్లా , మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా(గన్నే ప్రసాద్) కి క్షమాపణ, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకి పరువు నష్టం దావా నోటీసులు పంపిస్తానని కొత్త భాష్యానికి తెరలేపారు. జి.కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో సొసైటీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ మంత్రి ఉమామహేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవినేని ఉమామహేశ్వరరావుపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ నేత అన్నా(గన్నే ప్రసాద్)పై చేసిన వ్యాఖ్యలకు వసంత కృష్ణప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు. రౌడీషీటర్ అన్న మాటలను గుర్తు చేస్తూ క్షమాపణ చెబుతున్నానని చెవుటూరు గ్రామంలో కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటానని అన్నా(గన్నే ప్రసాద్) డిమాండ్ చేశారు. గన్నే ప్రసాద్ డిమాండ్ మేరకు వసంత కృష్ణప్రసాద్ క్షమాపణలు తెలిపారు. అయితే దేవినేనికి మాత్రం నోటీసులు పంపుతానని కొత్త స్ట్రాటాజికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెరలేపారు.