ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ యువనేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తన ఎస్సీలు, బీసీలు అంటున్న జగన్మోహన్రెడ్డి ఆయా వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు చెందాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేయడమేగాక, రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్ అని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు జరిగిన అన్యాయాలను ప్రశ్నించిన దళితులను జగన్ సర్కారు అణచివేసిందని విమర్శించారు.