నిరుధ్యోగులకు ఉపాధి లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పశ్చిమ నియోజక వర్గం సమన్వయ కర్త, ఏపీఎంఎస్ఎంఈడీసీ ఛైర్మన్ ఆడారి ఆనంద కుమార్ ఏర్పాటు చేసిన మెగా జాబ్ ఫేర్‌ను సద్వినియోగం చేసుకోవాలని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. జాబ్ ఫేర్‌కు సంబంధించిన పోస్టర్ ను మంగళవారం వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈ జాబ్ ఫేర్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తున్న వ్యక్తి ఆడారి ఆనంద్ కుమార్ అని మెచ్చుకున్నారు. సమస్యలను అందరు వింటారని, ఆ సమస్యను తీర్చే నాయకులు కొందరే ఉంటారని అయితే ఆ కొందరులో ఆడారి ఆనంద్ కుమార్ ముందుంటారని చెప్పారు. డిసెంబర్ 1, 2వ తేదీల్లో ఎంఏవిపి జూనియర్ కళాశాల (ఆండాలమ్మ కాలేజీ) , ఆల్వార్ పాలిటెక్నిక్, జింక్ హనుమాన్ టెంపుల్ దగ్గర జరిగే ఈ జాబ్ ఫేర్ ను నిరుద్యోగ యువత ఉపయోగించుకొని ఉపాధి పొంది ఆర్థిక స్వాలంబన పొందాలని సూచించారు. ఆడారి ఆనంద కుమార్ మాట్లాడుతూ.. జాబ్ ఫేర్ కు 50 కంపెనీలు వస్తాయని భావించగా, సుమారు 70కి పైగా కంపెనీలు పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన తెలిపారు . ప్రజల సౌకర్యార్థం రూపొందించిన మీతో ఆనంద్ అనే యాప్ ను కూడా ప్రజలు... నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జాబ్ ఫేర్ కు సంబంధించి మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లలో ఫోన్ నంబర్లు: 90008 18467, 90009 38467ను సంప్రదించవచ్చని తెలిపారు.