తన కన్నబిడ్డపై ప్రియుడు అత్యాచారం చేస్తుంటే కనీసం అడ్డుకోవాల్సింది పోయి.. అతడికి సహకరించింది. అత్యంత దారుణంగా వ్యవహరించి.. మాతృత్వానికే కళంకం తీసుకొచ్చిన ఆ మహిళకు న్యాయస్థానం తగిన శిక్ష వేసింది. కుమార్తెపై అత్యాచారానికి అనుమతించిన కసాయి తల్లికి 40 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది కేరళ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. కేరళలో 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబరు మధ్య జరిగిన ఈ ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మతిస్థిమితం లేని భర్తను వదిలేసి.. తన ఏడేళ్ల కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వచ్చేసింది. అనంతరం ప్రియుడి శిశుపాలన్‌తో కలిసి కాపురం పెట్టింది.
ఆ కామాంధుడు అభంశుభం తెలియని ఆ చిన్నారికి ఏడాదిన్నర పాటు నరకం చూపించాడు. పోలీసుల కథనం ప్రకారం.. లైంగిక దాడితో చిన్నారి జననంగాలకు తీవ్ర గాయాలయ్యాయి. అత్యంత దారుణంగా బాలికపై పలుసార్లు లైంగిక దాడికి తెగబడినట్టు తెలిపారు. మహిళ కళ్లముందే ఇంత జరుగుతున్నా అడ్డుకోలేదు సరికదా.. కుమార్తెను స్వయంగా తీసుకెళ్లి వాడికి అప్పగించింది. బాధిత చిన్నారి అక్క (11) ఇంటికి వచ్చినప్పుడు లైంగిక వేధింపుల గురించి ఆమెకు తెలిపింది. ఆ పాపను కూడా శిశుపాలన్ వేధింపులకు గురిచేశాడు.
వారిని నిందితుడు బెదిరించడంతో భయపడి బయటపెట్టలేదు. పిల్లలు సమాచారం వెల్లడించలేదు. అక్కాచెల్లెళ్లు అక్కడ నుంచి తప్పించుకుని, నాయినమ్మకు ఇంటికి వెళ్లి జరిగిన ఘోరం గురించి తెలియజేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పిల్లలను చిల్డ్రన్స్ హోంకు తరలించారు. కౌన్సెలింగ్‌లో తమపై జరిగిన లైంగిక దాడులను బయటపెట్టారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ విజయ్ మోహన్ మాట్లాడుతూ.. ‘ఈ నేరానికి తల్లికి 40 ఏళ్లు జైలు, రూ.20 వేల జరిమానా విధించారు.. నిందితురాలి ఇద్దరు కుమార్తెలను ఆమె ప్రియులు వారిని లైంగికంగా, క్రూరంగా వేధించారు. మహిళ అసలు భర్త మానసిక రోగి. దీంతో ఆమె పిల్లలతో కలిసి ఇల్లు వదిలి ఇద్దరు ప్రేమికులతో ఉంటోంది.. మొదటి ప్రియుడు శిశుపాలన్ బాలికకు ఏడేళ్ల వయసున్నప్పుడు దారుణంగా వేధించాడు. ఆ సమయంలో బాధితురాలు జరిగిన మొత్తం తల్లికి చెప్పినా పట్టించుకోలేదు కదా.. ప్రేమికుడికి సహకరించింది. ఇది మాతృత్వానికి అవమానకరం.. ఆమె క్షమాపణలకు అర్హురాలు కాదని న్యాయమూర్తి ఆర్ రేఖ నిర్ధారించారు.. ఆమెకు గరిష్ట శిక్ష విధించారు’ అన్నారాయన. విచారణలో మొదటి నిందితుడు శిశుపాలన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి తల్లిపై మాత్రమే విచారణ జరిగింది. పిల్లలు ప్రస్తుతం చిల్డ్రన్ హోమ్‌లో ఉన్నారు. ఈ కేసులో మొత్తం 22 మంది సాక్షులను విచారించి, 33 పేజీల నివేదికను కోర్టుకు పోలీసులు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa