ఏడుగురు కాశ్మీరీ విద్యార్థుల అరెస్టును పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం ఖండించారు. జమ్మూకశ్మీర్ విద్యార్థుల అరెస్ట్ దిగ్భ్రాంతిని, ఆందోళనను కలిగించిందని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను ముఫ్తీ అభ్యర్థించారు. ఈ చర్యతో జమ్మూకశ్మీర్ యువత పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతోంది అని పేర్కొన్నారు.