2030 నాటికి దేశీయ ఐటీ రంగం 350 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని యాక్సిలర్ వెంచర్స్ చైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అంచనా వేశారు.
బెంగళూరు టెక్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని ఐటీ రంగంపై మాట్లాడారు. గతేడాది ఐటీ పరిశ్రమ 9 శాతం వృద్ధి చెంది 200 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి 350 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, వృద్ధి కొనసాగుతోందని గోపాలకృష్ణన్ వెల్లడించారు.