రూ.12,800 కోట్లు బడ్జెట్‌లో పెట్టి ప్రయివేటు రైతుల దగ్గర కొని 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు సమకూర్చాం. ఇప్పుడు ఊళ్లకు ఊళ్లు నిర్మాణం జరుగుతున్నాయి అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అయన మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో పట్టుమని 5 లక్షల ఇళ్లకు ఏనాడైనా భూమి కొన్నాడా? సీఎం జగన్ అన్ని స్కూళ్లూ బాగు చేయించాడు. ఉపాధ్యాయులను నియమించాడు. కంప్యూటర్, పుస్తకాలు, బట్టలు ఇచ్చి మంచి తిండి పెట్టాడు. తల్లికి అమ్మ ఒడి ద్వారా రూ.15 వేలు ఇచ్చాడు. పది సంవత్సరాల పిల్లాడు ఓటేస్తాడని జగన్ ఇవన్నీ చేశాడా? పిల్లాడు పెరిగి పెద్ద అయ్యి చదివి ఉన్నత స్థాయికి చేరితే ఆ కుటుంబం స్థాయి పెరుగుతుందని సీఎం జగన్ ఇదంతా చేస్తున్నారు. రూ.2.40 లక్షల కోట్లు మీ ఖాతాల్లో వేసిన సీఎం జగన్. ఎక్కడా ఒక్కరూపాయి లంచం ఇచ్చామనే కంప్లయింట్ రాలేదు. ఈ డబ్బంతా వేస్్ట అని చంద్రబాబు అంటాడు. మళ్లీ తనకు ఓటేయమంటాడు. గతంలో ఊరికి ఐదు మంది చొప్పున లంచం తీసుకొనేవాళ్లను పెట్టారు. ఇప్పుడు కులం, మతం, వర్గం అడగలేదు. ఆకలి తీర్చాల్సిన, కన్నీరు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సీఎం జగన్ చెప్పారు. ఏ గ్రామంలోనూ వైయస్సార్‌సీపీకి వ్యతిరేకత లేదు. దీంతో నూనె, కరెంటు, గ్యాస్, పెట్రోలు, డీజిలు, కిరోసిన్ ధరలు పెరిగాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ ధరలు దేశమంతా ఒకేలా ఉన్నాయి. ఒకేలా పెరిగాయి. పెంచింది కేంద్రం. ఇతర విషయాల్లో ఈ ప్రభుత్వాన్ని విమర్శించలేరు కాబట్టి టీడీపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తున్నారు. పథకాలు అందుకోవడంలో బీదవాడు గౌరవంగా, దర్జాగా జీవించే పరిస్థితి తెచ్చాం. చంద్రబాబు హయాంలో రాష్ట్ర జీఎస్‌డీపీ 16వ ర్యాంకు ఉండేది. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది. గతంలో తలసరి ఆదాయంలో ఏపీ 17వ ర్యాంకు ఉంటే నేడు 9వ ర్యాంకుకు వచ్చాం. నాడు అప్పుల గ్రోత్ రేటు 169 శాతం ఉంటే నేడు 58 శాతమే. టీడీపీ హయాంలో అగ్రికల్చర్ గ్రోత్‌రేటు –6.5 ఉంటే నేడు +5.56 శాతం ఉంది అని తెలిపారు.