కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీపీఐ అనంతపురం జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ధర్మవరం పట్టణంలోని కదిరిగేటు వద్దగల బ్రహ్మంగారి గుడిలో బుధవారం సీపీఐ నియోజకవర్గ స్థాయి సమావేశం నియోజకవర్గ కార్యదర్శి మధు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వేమయ్యయాదవ్ మాట్లాడుతూ... కార్పొరేట్, మతోన్మాద విధానాలు, అధికధరలు, నిరుద్యోగం, ప్రైవేటీకరణ, జీఎస్టీతో భారాలు తదితరవాటిపై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. పోలవరం నిర్వాసితులకు నిధులు ఇవ్వకపోవడం, రాష్ర్టానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ధరలు పెంపుదలపై వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఘోరంగా విఫలమైందన్నారు.