జర్మనీలో మంచు తుఫాను కురవడంతో మ్యూనిక్ విమానాశ్రయం మంచులో కూరుకుపోయింది. ఈ తుపాను కారణంగా 760 విమాన సర్వీసులు రద్దయ్యాయని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి.
ఆదివారం ఉదయం ఎయిర్‌పోర్టును తెరవగా ప్రజలు పరిస్థితుల దృష్ట్యా ప్రయాణాలు చేయాలని తెలిపారు. ఈ మంచు తుఫాను కారణంగా మ్యూనిక్ నగరంలోని సెంట్రల్ రైల్వేస్టేషన్‌ను మూసివేసినట్లు జర్మనీ జాతీయ రైల్వే కంపెనీ వెల్లడించింది.